జూనియర్ ఎన్టీఆర్-'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా రానుందని మైత్రీమూవీ మేకర్స్ నిర్మాతలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ దర్శకుడు ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న'సలార్' తర్వాత తారక్ చిత్రం ప్రారంభమవుతుందని తెలిపారు. గురువారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ గురించి మరోసారి అధికారికంగా ప్రకటిస్తూ ట్వీట్ చేసింది నిర్మాణ సంస్థ.
'కేజీఎఫ్' దర్శకుడితో తారక్.. ఫుల్ క్లారిటీ - ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా
తారక్.. 'ఆర్ఆర్ఆర్', త్రివిక్రమ్‌తో సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారని తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు ఫ్యాన్స్‌లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మైత్రీమూవీమేకర్స్ సంస్థ.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్
ఎలాంటి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తారు? ఇందులోని ఇతర నటీనటులు ఎవరు? అనే విషయాల్ని త్వరలో వెల్లడించే అవకాశముంది. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చేస్తున్న తారక్.. అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుంది.