తన ప్రాణ స్నేహితుడు, కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు(puneeth rajkumar ntr tweet) హీరో ఎన్టీఆర్ నివాళులర్పించారు. పునీత్ మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆయన శనివారం ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు(ntr puneeth rajkumar). కంఠీరవ మైదానంలో శ్రద్ధాంజలి ఘటించారు. పునీత్ పార్థివదేహాన్ని చూస్తూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.
అనంతరం ఎన్టీఆర్‌ను(puneeth rajkumar death news) చూసిన పునీత్ సోదరుడు శివ రాజ్‌కుమార్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే తారక్ ఆయన్ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. తారక్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్‌నీల్ పునీత్‌కు నివాళులర్పించారు. అంతకుముందు కథానాయకుడు బాలకృష్ణ కూడా బెంగళూరు చేరుకుని పునీత్ పార్థివదేహాన్ని నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యుల్ని ఓదార్చారు.