స్టార్ హీరోలకు ఇగోలు ఉంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటివన్నీ అపోహలేనని నిరూపించారు టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్. ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో బిజీగా ఉన్న వీరిద్దరూ.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా తమ మనసులోని భావాల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. #ఆర్ఆర్ఆర్ హే దోస్తీ హ్యాష్ ట్యాగ్‌తో ఇద్దరూ కలిసున్న ఫొటోల్ని పంచుకున్నారు.
"స్నేహాన్ని నెమ్మదిగా ప్రారంభించాలి. ఒక్కసారి పుట్టాక దృఢంగా, చిరకాలం ఉండేలా చేసుకోవాలని ప్రఖ్యాత సోక్రటీస్ చెప్పారు. మా స్నేహం గురించి ఇంతకంటే గొప్పగా వర్ణించలేను. #ఆర్ఆర్ఆర్ హే దోస్తీ " -జూనియర్ ఎన్టీఆర్, హీరో