నందమూరి హరికృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో 'సీతయ్య' ఒకటి. ఈ చిత్రం ఎంతగా హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తనకు అవకాశమస్తే తప్పకుండా తన తండ్రి నటించిన 'సీతయ్య' సినిమాను రీమేక్ చేస్తానని అన్నారు హీరో ఎన్టీఆర్. 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్‌లో భాగంగా రామ్‌చరణ్‌తో కలిసి ఓ స్పెషల్ చిట్‌చాట్‌లో పాల్గొన్న తారక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన సంగీత దర్శకుడు కీరవాణి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. " సీతయ్య సినిమాకు మీరు స్వరాలు అందిస్తానంటే తప్పకుండా చేస్తాను. ముఖ్యంగా 'వినపడదు, వినలేదు, వినడు' అనే డైలాగ్ తప్పకుండా ఉండాలి" అని తారక్ చెప్పారు. వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ సినిమాలో సౌందర్య, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించగా.. కీరవాణి సంగీతం అందించారు.
ఈ చిట్‌చాట్ షోలో భాగంగా హరికృష్ణ 'సీతయ్య', చిరంజీవి 'ఘరాణా మొగుడు' సినిమా షూటింగ్ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు కీరవాణి. హరికృష్ణ, చిరంజీవి చాలా ఆత్మీయంగా ఉండేవారని అన్నారు. 'సీతయ్య' సినిమా తనకు ఆల్‌టైం ఫేవరెట్ మూవీ అని, అందులో 'ఒక్క మగాడు' సాంగ్ బాగా ఇష్టమని చెప్పారు.