తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పాన్​ఇండియాగా ఎన్టీఆర్‌30.. ఆరోజే ముహూర్తం! - ntr upcoming movies

NTR Koratala Siva Movie: మరో పాన్​ఇండియా చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు యంగ్​టైగర్ ఎన్టీఆర్​. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ntr alia bhatt
ntr koratala siva movie

By

Published : Jan 30, 2022, 6:24 PM IST

NTR Koratala Siva Movie: ప్రస్తుతం తెలుగు హీరోలందరూ పాన్‌ఇండియా మార్కెట్‌పై కన్నేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'రాధేశ్యామ్‌', 'సలార్‌', రామ్‌చరణ్‌-శంకర్‌ మూవీ పాన్‌ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతుండగా స్టార్‌ హీరో ఎన్టీఆర్‌.. తన తదుపరి చిత్రాన్నీ పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పవర్‌ఫుల్‌ కథాంశంతో సిద్ధం కానున్న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేయాలని చిత్రబృందం భావిస్తోందట.

ముహుర్తం ఆ రోజునే!

అలియా భట్

ఈ మేరకు సన్నాహాలు ప్రారంభమయ్యాయిని సమాచారం. అందుకు అనుగుణంగానే ఆయా చిత్రపరిశ్రమలకు చెందిన స్టార్‌లను ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేస్తోందని.. ఇప్పటికే హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ నటి ఆలియాభట్‌ని, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కోలీవుడ్‌ నుంచి అనిరుధ్‌ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఫిబ్రవరి 7న ఈసినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లు నెట్టింట వార్తలు దర్శనమిస్తున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఈ సినిమా కోసం శరీరాకృతిపై దృష్టి పెట్టారట. అందుకు అనుగుణంగా ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌లో ఉన్నారట. ఇక, కొరటాల శివ-తారక్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'జనతా గ్యారేజ్‌' సూపర్‌హిట్​ అయిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details