ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో కొత్త సినిమా ఖరారైంది. 'జనతా గ్యారేజ్' తర్వాత ఆ కలయికలో ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని కొరటాల ట్వీట్ చేశారు.
కొరటాల శివతో ఎన్టీఆర్ 30వ సినిమా ఫిక్స్ - ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా ప్రకటన
'ఆర్ఆర్‌ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటించనున్న కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ సినిమా ఖరారైంది. 2022 ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలిపింది చిత్రబృందం.
ఎన్టీఆర్-కొరటాల
జూన్ రెండో వారం నుంచి ఈ చిత్ర నుంచి మొదలు కానుంది. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక బృంద వివరాలను వెల్లడించనున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 29, 2022 ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్‌ఆర్', కొరటాల శివ దర్శకత్వం వహించిన 'ఆచార్య' చిత్రాలు చిత్రీకరణ తుది దశలో ఉన్నాయి.
ఇదీ చూడండి: 'ఎప్పటికైనా ఎన్టీఆర్తో సినిమా చేస్తా'
Last Updated : Apr 12, 2021, 7:24 PM IST