రాయలసీమ యాసలో ఎన్టీఆర్ సందడి చేసిన చిత్రం 'అరవింద సమేత'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు వీరిద్దరు మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ, కల్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తోనే - ntr RRR
ప్రముఖ కథానాయకుడు నందమూరి తారక రామారావు 30వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ఈ రోజు ప్రకటించారు.
తారక్.. దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇందులో కొమరం భీమ్‌గా కనిపించనున్నాడు. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివీయా మోరిస్ కనిపించనుంది. ఇది పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తాడు తారక్. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.