దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం (రణం రౌద్రం రుధిరం) 'ఆర్ఆర్ఆర్'. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. గురువారం (మే 20) తారక్ పుట్టినరోజు సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' నుంచి కొమురం భీమ్ అవతార్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఆర్ఆర్ఆర్: కొమురం భీమ్ లుక్ అప్డేట్ - ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్
నందమూరి అభిమానులకు సర్ప్రైజ్! యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నయా అవతార్‌ను గురువారం (మే 20) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
![ఆర్ఆర్ఆర్: కొమురం భీమ్ లుక్ అప్డేట్ NTR intense look from RRR Unveiling tommorow](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11818725-338-11818725-1621422612654.jpg)
ఆర్ఆర్ఆర్: కొమురం భీమ్ ఫస్ట్‌లుక్ అప్డేట్
మే 20 ఉదయం 10 గంటలకు 'ఆర్ఆర్ఆర్'లోని తారక్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్‌దేవ్‌గన్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇదీ చూడండి..'పవన్ సినిమాపై వస్తోన్న రూమర్లు అసత్యం!'
Last Updated : May 19, 2021, 5:03 PM IST