యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని 'ఆర్‌ఆర్‌ఆర్' నుంచి ఫస్ట్‌లుక్ కానీ స్పెషల్ టీజర్ కానీ ఉంటుందని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. అయితే ఎన్టీఆర్ బర్త్‌డేకు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వడం లేదని తాజాగా 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ వెల్లడించింది. లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో పనులన్నీ నిలిచిపోయాయని అందువల్ల వీడియోను కానీ ఫస్ట్‌లుక్‌ను కానీ విడుదల చేయలేకపోతున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టింది.
"లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించిన నేపథ్యంలో పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏదైనా స్పెషల్ వీడియోను విడుదల చేయాలని భావించాం. అందుకు మేము ఎంతగానో కష్టపడ్డాం. కాకపోతే వీడియో పూర్తి కాలేదు. అందువల్ల మేము ఆయన పుట్టినరోజు నాడు ఫస్ట్‌లుక్ కానీ, వీడియో సర్‌ప్రైజ్ కానీ ఇవ్వడం లేదు. మీ ఎదురుచూపులకు తగ్గట్టుగానే అద్భుతమైన వర్క్‌ను మీకు అందిస్తాం. ఒక్కసారి అది విడుదలైన రోజు మనందరికీ పండగ అవుతుంది" అని ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ పేర్కొంది. 'ఆర్‌ఆర్‌ఆర్' పెట్టిన ట్వీట్‌తో తారక్ అభిమానులు నిరాశకు గురయ్యారు.