ఇంటి పనులను పూర్తిగా మహిళలకే అప్పజెప్పకుండా పురుషులు కూడా వారికి చేదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ 'బి ద రియల్ మెన్' పేరుతో ఓ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. దర్శకుడు రాజమౌళికి సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించిన జక్కన్న ఇంటిని శుభ్రం చేసి రియల్ మెన్ అనిపించుకున్నారు. చరణ్, తారక్, సుకుమార్‌లు ఛాలెంజ్ స్వీకరించమని కోరారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సవాల్‌ను స్వీకరించి ఇంటి పనులు చేస్తున్న వీడియోను నెట్టింట షేర్ చేశారు.
బాలయ్య, చిరులకు సవాల్ విసిరిన తారక్ - NTR Accept Rajamouli Challenge
రాజమౌళి విసిరిన 'బి ద రియల్ మెన్' ఛాలెంజ్‌ను స్వీకరించారు జూనియర్ ఎన్టీఆర్. ఇంట్లో పనులు చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, కొరటాల శివ సవాల్ స్వీకరించాలని కోరారు.
ఎన్టీఆర్
ఈ వీడియోలో తారక్ ఇంటిని శుభ్రం చేస్తూ, పాత్రలు తుడుస్తూ, గార్డెన్లో చెత్తను శుభ్రం చేస్తూ కనిపించారు. "మన ఇంట్లో ప్రేమలు, ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందా అంటూ వ్యాఖ్య జోడించారు. అలాగే బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, కొరటాల శివలు ఈ ఛాలెంజ్ స్వీకరించాలని కోరారు.