RRR pre release event chennai: 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని ప్రతి సీన్ మళ్లీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ అన్నారు. ఎందుకంటే మళ్లీ రామ్‌చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవచ్చని తారక్ చెప్పారు. ఇది ముగింపు కాదని.. ప్రారంభమని అన్నారు. చెన్నైలో ఆదివారం జరిగిన 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ రామ్‌చరణ్ 'ఆర్ఆర్ఆర్' మూవీ ఈ కార్యక్రమానికి చిత్రబృందంతోపాటు హీరోలు శివకార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్.. నిర్మాతలు ఆర్బీ చౌదరి, కలైపులి ఎస్.థాను తదితరులు హాజరయ్యారు.
అలానే ఎన్టీఆర్‌ది చిన్నపిల్లల మనస్తత్వమని, సింహం లాంటి పర్సనాలిటీ అని ఇదే వేడుకలో పాల్గొన్న రామ్‌చరణ్ తెలిపారు. తాను మరణించేవరకు ఈ బ్రదర్హుడ్ మనసులో ఉంటుకుంటానని స్పష్టం చేశారు.
అలానే ఇదే ఈవెంట్లో పాల్గొన్న తమిళ హీరో శివకార్తికేయన్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పటివరకు హాలీవుడ్ సినిమాలు చుశావా అంటూ వాళ్లను వీళ్లను అడిగాం. కానీ ఇకపై ఇండియన్ సినిమా చూశావా అంటూ విదేశాల్లో ఉన్నవాళ్లను అడగబోతున్నాం. అది 'ఆర్ఆర్ఆర్'తో మొదలుకానుంది' అని చెప్పారు.
ఇవీ చదవండి: