RRR movie: రామ్‌చరణ్-తారక్ ప్రధాన పాత్రల్లో నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్రబృందం ఫుల్ బిజీగా పాల్గొంటోంది. తాజాగా 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తారక్, చరణ్, రాజమౌళి పాల్గొని ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
- సినిమాని తెరకెక్కించే సమయంలో దేనిని మీరు పరిగణలోకి తీసుకుంటారు?
రాజమౌళి: ఎమోషన్. భావోద్వేగం ఉంటే ఏ సీన్ అయినా సరే కచ్చితంగా పండుతుందని నేను నమ్ముతాను. 'ఆర్‌ఆర్‌ఆర్'లో కూడా ప్రతి ఫ్రేమ్‌లో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. 'నాటు నాటు' మాస్ డ్యాన్స్ నంబర్ అనుకుంటారు. అది కేవలం డ్యాన్స్ నంబర్ మాత్రమే కాదు అందులో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. సినిమా విడుదలయ్యాక మీరు చూస్తారు.
- మీ ఇద్దరు మంచి నటులు.. ఆవిషయం అందరికీ తెలుసు. దానిపై మీ అభిప్రాయం?
చరణ్: మా ఇద్దరి కంటే మా గురించి ఆయనకే ఎక్కువగా తెలుసు. అందుకే మమ్మల్ని ఈ అద్భుతమైన చిత్రంలో భాగం చేశారు. ఈ సినిమాలో నటించడం వల్ల మొదటిసారి నాకు నేను ఎంతో విభిన్నంగా, పవర్‌ఫుల్‌గా కనిపించాను. నటుడిగా నాలోని మరో కోణం నాక్కూడా తెలిసి వచ్చింది.
ఎన్టీఆర్:రాజమౌళి నాకు స్నేహితుడు మాత్రమే కాదు జీవితంలో ఎంతో కీలకమైన వ్యక్తి. కెరీర్‌లో ఏం జరుగుతుందో కూడా తెలియని సమయంలో, సాధారణంగా ఉన్న నా జీవితాన్ని ఇంతలా మార్చింది అతనే. ఆయన వల్లే నేను మంచి నటుడిగా మారగలిగాను. 'ఆర్‌ఆర్‌ఆర్'లో నేను పోషించిన పాత్ర ఎంతో క్లిష్టమైనది. ఆయన వల్లే ఆ పాత్ర చేయడం సాధ్యమైంది.
చరణ్: ప్రతిసారీ షాట్ అయ్యాక.. జక్కన్న నోటి నుంచి ఒక్క ఎస్ వస్తే అది చాలు మేము ఆనందపడే వాళ్లం.
- ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయడం మీకు ఎలా అనిపించింది? మీరు ఏం చెప్పినా వీళ్లు చేస్తారు అనే భావన మీకు వచ్చిందా?
రాజమౌళి: "నేను ఏం చెప్పినా ఓకే చేస్తారు. నా సినిమాలో ఎవరైనా నటిస్తారు" అనే భావన వస్తే అదే నా పతనానికి నాంది అని నేను భావిస్తాను. నేను అలాంటి వాతావరణంలో పెరగలేదు. అలాంటి ఆలోచన నాలో లేదు. నా కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి రెండు పవర్‌ఫుల్ పాత్రలతో సినిమా చేయాలనే ఆలోచన ఉంది. సాధారణంగా మనకి దుర్యోధనుడు-కర్ణుడు, కృష్ణుడు-అర్జునుడు స్నేహితులని తెలుసు. కానీ, కృష్ణుడు-దుర్యోధనుడు స్నేహితులైతే ఎలా ఉంటుంది అనేది నా ఆలోచన. అదే మాదిరిగా అల్లూరి, కొమురం భీమ్ ఆలోచన వచ్చినప్పుడు చరణ్-తారక్ అయితే నా పాత్రలకు న్యాయం చేయగలరని నమ్మకం వచ్చింది. మా మధ్య మంచి స్నేహం ఉంది. కథలో ఉన్న ఉత్సాహమే రెండున్నర సంవత్సరాలపాటు ఈ జర్నీ ఇలా సాగేలా చేసింది.
- మీరు స్క్రీప్ట్ వినకుండానే ఈ కథ ఓకే చేశారని విన్నాం. ప్రతిసారీ స్క్రిప్ట్ వినరా?
చరణ్: ప్రతిసారీ ఇలా చేయను. రాజమౌళి కాబట్టే కథ వినకుండానే ఓకే చెప్పాను. మరో వ్యక్తి సుకుమార్. ఆయన తెరకెక్కించిన 'రంగస్థలం'కు కూడా నేను కథ వినలేదు.
- సన్నివేశాల విషయంలో జక్కన్న ఎంతో కచ్చితంగా ఉంటారని విన్నాం?
ఎన్టీఆర్:ఈ సినిమాలో ఓ కీలకమైన ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది దాని కోసం ఆయన 65 సార్లు షూట్ చేశాడు. ఆయన ప్రతి విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడు. అప్పుడప్పుడూ మా ఆలోచనలు కూడా తీసుకుంటాడు.
- రాజమౌళి సెట్‌లో ఎలా ఉంటాడు?
చరణ్: సెట్‌లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన ప్రవర్తన ఉంటుంది. ఒకవేళ 24 క్రాఫ్ట్‌ల్లో ఎవరైనా సరిగ్గా చేయకపోతే వెంటనే ఆయనకు కోపం వచ్చేస్తుంది.
ఎన్టీఆర్:ఆయన టాస్క్ మాస్టర్. పర్‌ఫెక్షనిస్ట్.
రాజమౌళి: ప్రతి సన్నివేశానికి సంబంధించి నాలో ఒక ఆలోచన ఉంటుంది. ఎవరైనా సరిగ్గా చేయకపోతే నా ఆలోచనకు తగినట్టు సీన్ రాదేమోనని భయపడుతుంటాను.
- ఈ సినిమాలో ఎక్కువగా దేశభక్తి గురించి చూపించారా?
రాజమౌళి: ఇది దేశభక్తి చిత్రం కాదు. కేవలం స్నేహానికి సంబంధించిన సినిమా. దేశం, జాతి మీద గౌరవం ఉంది. ఇప్పటికీ జనగణమన వింటే నాకు కన్నీళ్లు ఆగవు. రోమాలు నిక్కబొడుచుకుంటాయ్. అలా అని నేను వేరే దేశం వాళ్లని ఇష్టపడనని అర్థం కాదు. దేశభక్తి ఉంది. అదే విధంగా ఇతరుల్ని గౌరవించే సంస్కారం కూడా ఉంది.
- మీరు ఎప్పుడైనా బడ్జెట్ గురించి ఆలోచించారా?