'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబయిలో వేడుకగా జరిగింది. ఈ ఈవెంట్లో దర్శకుడు రాజమౌళి, హీరో ఎన్టీఆర్, నిర్మాత దానయ్యతో పాటు అజయ్ దేవ్‌గణ్, హీరోయిన్ ఆలియా భట్ పాల్గొన్నారు. ఈ క్రమంలో రిపోర్టర్లు అడిగిన పలు ప్రశ్నలకు వీరు సమాధానాలిచ్చారు. తారక్.. 'నాటు నాటు' పాట గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
"నాటు నాటు' పాటలో వేసే స్టెప్పు చాలా సులభమే. కానీ రాజమౌళి మానిటర్ ప్రతి మూమెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించేవారు. దీంతో నాటు నాటు స్టెప్పు కరెక్ట్‌గా రావడానికి 18 టేక్స్ పట్టింది. ఈ పాటను ఉక్రెయిన్‌లో షూట్ చేశాం. అక్కడ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వెలుతురు ఉండేది. దీంతో రాజమాళి మాతో ఆ సమయం అంతా ప్రాక్టీసు చేయిస్తూనే ఉండేవారు(నవ్వుతూ)" అని ఎన్టీఆర్ చెప్పారు.