NTR about Rajamoli: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో తాను ఎంతో అవగాహనతో నటించినట్లు తెలిపారు హీరో ఎన్టీఆర్. తనవంతుగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం తన బాధ్యత అని చెప్పారు.
"ప్రతిరోజు కష్టంగా అనిపించేది. కానీ మనపై ఒత్తిడి లేకపోతే మనుగడ సాగించలేం. మనల్ని నమ్మి ఒకరు పెట్టుబడి పెట్టారని, ఒకరి విజన్‌లో మనం భాగస్వామ్యం అయ్యామని గుర్తంచుకోవాలి. డబ్బులు విషయాన్ని పక్కనపెడితే మనపై నమ్మకం ఉంచినప్పుడు దానికి న్యాయం చేయాలి. అది మన బాధ్యత." అని తారక్ అన్నారు.
రాజమౌళితో పనిచేయడం సవాల్‌లాంటిదని పేర్కొన్నారు ఎన్టీఆర్. 'ఆర్ఆర్ఆర్' తర్వాత మల్టీస్టారర్ చిత్రాల జోరు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. "చిత్రయూనిట్‌లోని మిగతా సిబ్బంది విరామం తీసుకున్నప్పటికీ రాజమౌళి నిరంతరం పనిచేసేవారు. మమల్ని పిలిచి సన్నివేశాల గురించి చర్చించేవారు. దీనిద్వారా నేనెప్పుడూ పాత్రలోనే లీనమైఉండేవాడిని. ఆయనతో పనిచేయడం సవాల్. నేను కూడా దానెప్పుడూ ఇష్టపడతాను. దర్శకుడిగా తానేంటో నిరూపించుకునేందుకు ఎప్పుడూ తనకు తానే సవాల్ విసురుకుంటూ పనిచేస్తారు. మనలోని నటన నైపుణ్యాన్ని 50, 80 శాతం ఇస్తే సరిపోదు 100శాతం ఆయనకు ఇవ్వాలి. అప్పుడే తను సీట్లో నుంచి లేచి వచ్చి ఓకే అంటారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత మల్టీస్టారర్ చిత్రాల హవా పెరుగుతుందని భావిస్తున్నా. నాకు తెలిసి చాలా చీత్రసీమల్లో ఇద్దరు హీరోల కాంబినేషన్స్‌లో సినిమాలు చేయడం ఆపేశారు. హిందీలో 'కరణ్అర్జున్' తర్వాత ఇద్దరు స్టార్ హీరోలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ మల్టీస్టారర్ చిత్రాలు రాలేదు. ఎందుకు రాలేదు అంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ ఇకపై వస్తాయని అనుకుంటున్నాను. అది మాతోనే ప్రారంభం అవ్వడం గర్వంగా భావిస్తున్నాను" అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'లో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో సినిమాను నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇదీ చూడండి: మా అమ్మ ఆ విషయం చెప్పలేదు: చరణ్