'నాకు సొంతిల్లు కూడా లేదు.. అయినా పునీత్ స్ఫూర్తితో సమాజ సేవ చేస్తా' పునీత్ చదివించిన 1800 మంది విద్యార్థుల బాధ్యతను తాను తీసుకుంటానన్న మాటకు (Actor Vishal latest news) కట్టుబడి ఉంటానని తమిళ నటుడు విశాల్ స్పష్టం చేశారు. తాను ఇల్లు కొనడానికి పోగు చేసుకున్న డబ్బును ఇందుకు వినియోగించనున్నట్లు తెలిపారు. తన కోరికల కన్నా విద్యార్థుల చదువులే ప్రధానం అని చెప్పారు. పేరుప్రతిష్ఠల కోసం తాను ఈ కార్యక్రమాలు చేయటం లేదని చెప్పారు.
ఇటీవల మరణించిన పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళి అర్పిస్తూ బెంగళూరులో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన (puneeth raj kumar news) కార్యక్రమంలో పాల్గొన్నారు విశాల్.
ఇకపై ఆ బాధ్యత నాది:
ఇటీవల 'ఎనిమి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. పునీత్ సేవా కార్యక్రమాలకు తన వంతు చేయూతనందిస్తానని విశాల్ తెలిపారు. 'విశాల్ పునీత్ రాజ్‌కుమార్ లేరనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు సమాజానికీ తీరని లోటు. ఎంతోమందికి ఉచిత విద్యని అందించారు. వృద్ధాశ్రమాల్ని నడిపారు. ఇవే కాదు సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు. ఇన్ని పనుల్ని ప్రభుత్వం చేసిందంటే నమ్మొచ్చు. కానీ, ఒక మనిషి చేశాడంటే నమ్మడం కష్టమే. చివరిగా తన కళ్లనీ దానం చేశారు. ఇప్పటి వరకూ చదివించిన 1800 మంది చిన్నారులని తన స్నేహితుడిగా నేను చదివిస్తానని పునీత్‌కు మాటిస్తున్నా. పునీత్ సేవా కార్యక్రమాలకి నా వంతు చేయూతనందిస్తా.'అని విశాల్ మాటిచ్చారు.
ఇదీ చదవండి:ఆ బాధ్యత స్వీకరిస్తానని పునీత్‌కు మాటిస్తున్నా: విశాల్