బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపింది.
"నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లో క్వారంటైన్లో ఉన్నా. నాకు మద్దతుగా నిలిచినందుకు అందరికీ కృతజ్ఞతలు. అందరూ జాగ్రత్తగా ఉండండి" అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది సనా.