తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మున్నాభాయ్ 3​.. మూడు కథలు సిద్ధం! - రాజ్​కుమార్​ హిరాణీ

బాలీవుడ్​లో ఘనవిజయం సాధించిన 'మున్నాభాయ్​' సిరీస్​లో.. మరో చిత్రం కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీక్వెల్​కు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించాడు నటుడు అర్షద్​ వార్సి.

Not one but three scripts are ready for Munna Bhai 3, reveals Arshad Warsi
మున్నాభాయ్ 3​.. మూడు కథలు సిద్ధం!

By

Published : Dec 26, 2020, 10:07 PM IST

మున్నాభాయ్​ సిరీస్​లో మూడో చిత్రం​ కోసం దర్శకుడు రాజ్​కుమార్​ హిరాణీ, రచయిత అభిజత్ జోషీల వద్ద మూడు కథలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించాడు నటుడు అర్షద్ వార్సి. 'మున్నాభాయ్​'లో సంజయ్​దత్​ పక్కన 'సర్క్యూట్'​ పాత్రలో నటించాడు అర్షద్. కొత్త చిత్రం ఎప్పుడు సెట్స్​​పైకి వెళ్తుందో మాత్రం తెలియదంటున్నాడు వార్సి.

"మున్నాభాయ్​ సీక్వెల్​ కోసం మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. నిర్మాత, దర్శకుడు, నటీనటులు, ప్రేక్షకులు అందరూ సిద్ధంగా ఉన్నారు. అయినా సినిమా ఎందుకు పట్టాలెక్కడం లేదో తెలియడంలేదు."

-- అర్షద్ వార్సి, బాలీవుడ్ నటుడు

సంజయ్​ దత్​, అర్షద్ వార్సిలతో దర్శకుడు రాజ్​కుమార్​ హిరాణీ, నిర్మాత విధు వినోద్​ చోప్రా తెరకెక్కించిన 'మున్నాభాయ్​ ఎంబీబీఎస్'​ చిత్రం 2003లో బాక్సాఫీస్​ వద్ద ఘనవిజయం సాధించింది. 2006లో దానికి సీక్వెల్​గా రూపొందిన 'లగే రహో మున్నాభాయ్' కూడా ఆకట్టుకుంటుంది. వీటికి కొనసాగింపుగా మరో చిత్రం వస్తుందని ఇప్పటికే అనేక కథనాలు వచ్చాయి.

మున్నాభాయ్ 3​ కోసం ఓ కాన్సెప్ట్​పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చోప్రా ఫిబ్రవరిలో తెలిపారు. కథకు మరిన్ని మెరుగులు దిద్దుతున్నట్లు వెల్లడించారు.

తెలుగులో మెగాస్టార్​ చిరంజీవి నటించిన 'శంకర్​దాదా ఎంబీబీఎస్', 'శంకర్​దాదా జిందాబాద్'​ చిత్రాలు మున్నాభాయ్​ ఆధారంగా రూపొందినవే.

ఇదీ చూడండి:'క్రేజీ అంకుల్స్​'తో నవ్వులు పండిస్తున్న శ్రీముఖి!

ABOUT THE AUTHOR

...view details