తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ చిట్కాలతో 15 కిలోల బరువు తగ్గా: ఖుష్బూ - నటి ఖుష్బూ

ఎంతో బొద్దుగా(khushboo weight loss journey) ఉండే సీనియర్​ నటి ఖుష్బూ ఇటీవల కాలంలో సన్నగా మారిపోయి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే(khushboo weight loss secrets) ఈ బరువు తగ్గడానికి తాను ఎలాంటి పద్ధతులు పాటించిందో తెలిపింది.

Khusbhu sundar's
ఖుష్బూ సుందర్‌

By

Published : Oct 16, 2021, 9:11 PM IST

ఖుష్బూ సుందర్‌(khushboo weight loss journey) .. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో నటిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించిందీ అమ్మడు(khushboo weight loss secrets). తన అందం, అభినయంతో అశేష అభిమానులను సొంతం చేసుకుంది. భర్త సుందర్‌తో కలిసి సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు కూడా తెరకెక్కిస్తోంది. ఇక పలు టీవీ షోలు, కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. అయితే ఈమె గతంలో ఎంతో బొద్దుగా ఉండేదన్న సంగతి తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో సన్నజాజి తీగలా మారిపోయి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది(khushboo weight loss). లాక్‌డౌన్‌లో అధిక బరువును తగ్గించుకున్న ఆమె ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తన మేకోవర్‌కు సంబంధించిన ఫొటోలు తరచూ పంచుకుంటోంది. బరువు తగ్గడానికి ముందు, ఇప్పుడు తీసుకున్న ఫొటోలను కొలేజ్‌ చేసి ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఖుష్బూ... 'అప్పటికీ.. ఇప్పటికీ పెద్దగా వ్యత్యాసమేమీ లేదు. కేవలం 15 కిలోలు తగ్గానంతే..!' అని సరదాగా క్యాప్షన్‌ రాసుకొచ్చింది. అయితే ఈ బరువు తగ్గడానికి తాను ఏ పద్దతులు పాటించిందో చెప్పుకొచ్చింది.

ఖుష్బూ సుందర్‌

బిరియానీ, ఐస్‌క్రీం తినడం మానేశాను!

ఈటీవీలో 'ఢీ' మాదిరిగానే తమిళంలో 'డ్యాన్స్‌ వర్సెస్‌ డ్యాన్స్‌' పేరుతో నిర్వహించే డ్యాన్స్‌ రియాలీటీ షో ఎంతో గుర్తింపు పొందింది. ఇప్పటికే మొదటి సీజన్‌ పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం రెండో సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఖుష్బూతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బృందా మాస్టర్‌ దీనికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఖుష్బూ తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
"సుందర్‌తో పెళ్లైనప్పటి నుంచి నేను 20 కిలోల బరువు పెరిగాను. దీంతో చాలా బొద్దుగా మారిపోయాను. లాక్‌డౌన్‌లో సినిమా షూటింగులు లేకపోవడంతో ఖాళీ సమయం దొరికింది. దీంతో అదనపు బరువును కరిగించుకుందామని గట్టిగా నిర్ణయించుకున్నాను. అయితే అది అంత సులభం కాదని, అలాగనీ అసాధ్యమూ కాదన్న విషయం నాకు తెలుసు. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌లో కొన్ని కఠినమైన డైట్ నియమాలు పాటించాను. నేను ఫుడ్‌ లవర్‌ని కాకపోయినా బిరియానీ, ఐస్‌క్రీంలు బాగా తింటాను. అయితే బరువు తగ్గడం కోసం వాటిని పూర్తిగా దూరం పెట్టాను. యోగాసనాలు చేశాను. క్రమం తప్పకుండా రోజూ 40 నిమిషాల పాటు వాకింగ్‌ చేశాను. అలా నేను అనుకున్న లక్ష్యానికి క్రమంగా చేరువవుతున్నా. ప్రస్తుతం నా పెళ్లి వేడుకల సమయంలో వేసుకున్న దుస్తుల్లో కూడా పర్‌ఫెక్ట్‌గా ఫిట్ అవుతున్నా" అని చెప్పుకొచ్చింది.

ఖుష్బూ సుందర్‌

ఇంటి పనులన్నీ నేనే చేసుకున్నాను!

ఇదే కాక ఇటీవల కొన్ని సందర్భాల్లో కూడా తన వెయిట్‌లాస్‌కు సంబంధించిన పలు విషయాలు షేర్‌ చేసుకుంది ఖుష్బూ. "గత ఏడాది నవంబర్‌లో నా బరువు 92 కిలోలు. ప్రస్తుతం 15 కిలోల బరువును తగ్గించుకున్నాను. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రి వచ్చిందేమీ కాదు. లాక్‌డౌన్‌లో సుమారు 70 రోజుల పాటు ఇంటి పనులన్నీ నేను ఒక్కదాన్నే చేసుకున్నా. ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, పాత్రలు కడగడం, లాండ్రీ పనులు, గార్డెనింగ్‌.. ఇలా ప్రతి పనీ నేనే చేసుకున్నా. నా బరువును తగ్గించడంలో కొన్ని వర్కవుట్లు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా వాకింగ్‌, కొన్ని యోగాసనాలు, ప్లాంక్‌ వ్యాయామాలు.. నా జీవితంలో భాగమైపోయాయి. మన కఠిన శ్రమ మంచి ఫలితాన్నిచ్చినప్పుడు ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేం. ఇంతటితో నా ప్రయాణం ఆగదు. మరిన్ని కిలోలు తగ్గి 69కి చేరుకోవాలన్నదే నా లక్ష్యం. త్వరలో ఇది పూర్తవుతుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

ఖుష్బూ సుందర్‌

2018లో విడుదలైన 'అజ్ఞాత వాసి' సినిమాలో చివరిగా కనిపించింది ఖుష్బూ. ప్రస్తుతం ఆమె 'ఆడాళ్లూ మీకు జోహార్లు'(adavallu meeku joharlu movie 2021) అనే తెలుగు సినిమాతో పాటు రజనీకాంత్‌ 'అన్నాత్తె' చిత్రంలోనూ నటిస్తోంది.

ఇదీ చూడండి: khushbhu birthday: బాలనటి నుంచి స్టార్​ హీరోయిన్​గా

ABOUT THE AUTHOR

...view details