ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ సాయిపల్లవి. ప్రస్తుతం తెలుగు, తమిళం, మాలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. " పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. సింగిల్‌గా ఉంటా. తల్లి తండ్రులను బాగా చూసుకుంటా"నని చెప్పింది సాయి పల్లవి.
పెళ్లి చేసుకోనంటున్న భానుమతి.. - sai pallavi
మలయాళ ముద్దుగుమ్మ సాయిపల్లవి... తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది.
సాయిపల్లవి
తెలుగులో శర్వానంద్‌తో చేసిన పడిపడి లేచే మనసు చిత్రం తర్వాత ఆమె తన కొత్త సినిమా ప్రకటించలేదు. తమిళంలో సూర్య సరసన ఎన్.జి.కె చిత్రంలో నటిస్తోంది. ఇందులో రకుల్ మరో కథానాయిక. ఈ చిత్ర టీజర్ ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
Last Updated : Feb 10, 2019, 2:00 PM IST