తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రీఎంట్రీపై సమీరా రెడ్డి ఏమందంటే? - ashok actress

సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం గురించి వస్తోన్న వదంతులపై స్పందించింది ప్రముఖ నటి సమీరా రెడ్డి. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్​ను ఎంజాయ్ చేస్తున్నానని, సినీ ప్రపంచంలోకి మళ్లీ రావడం కష్టమని స్పష్టం చేసింది.

Sameera Reddy
'సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంలేదు'

By

Published : Oct 30, 2020, 10:47 AM IST

బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలో నటించి కొన్నేళ్లపాటు ప్రేక్షకులను అలరించింది నటి సమీరా రెడ్డి. పెళ్లి అనంతరం వెండితెరకు దూరమైన ఆమె ప్రస్తుతం తన కుటుంబంతో సరదాగా గడుపుతోంది. తరచూ తన చిన్నారులతో కలిసి సరదా వీడియోలు చిత్రీకరించి సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో సమీరారెడ్డి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనుందంటూ గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

'అవన్నీ అవాస్తవాలే'

ఆర్య, విశాల్‌ ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్న ఓ కోలీవుడ్‌ చిత్రంలో సమీరా రెడ్డి నటించనుందంటూ వార్తలు వస్తున్నాయి. కాగా, తాజాగా సదరు వార్తలపై నటి స్పందించింది. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నానని వివరించింది.

సమీరా రెడ్డి

'నరసింహుడు'తో తెలుగులోకి

'మైనే దిల్‌ తుజ్కో దియా' అనే బాలీవుడ్‌ చిత్రంతో సమీరారెడ్డి కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన 'నరసింహుడు'తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆమె అనంతరం 'జై చిరంజీవా', 'అశోక్‌' చిత్రాల్లో కథానాయికగా నటించింది. 'కృష్ణం వందే జగద్గురుం'లోని ఓ ప్రత్యేక పాటలో ఆమె చివరిగా తెలుగు తెరపై ఆడిపాడింది.

ఇదీ చదవండి:అల్లరి నరేష్​ 'నాంది' చిత్రీకరణ పూర్తి

ABOUT THE AUTHOR

...view details