తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీ కాదు.. 'ఆర్య 3'లో హీరోగా విజయ్ దేవరకొండ! - అల్లు అర్జున్ విజయ్ దేరవకొండ

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన 'ఆర్య', 'ఆర్య 2' చిత్రాలు ఘనవిజయాల్ని సాధించాయి. త్వరలోనే 'ఆర్య 3'(arya 3 movie) కూడా ఉంటుందని ఇటీవలే సుకుమార్ స్పష్టం చేశారు. అయితే ఈ సినిమాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.

Allu Arjun
అల్లు అర్జున్

By

Published : Oct 20, 2021, 4:05 PM IST

ప్రస్తుతం అల్లు అర్జున్​(allu arjun new movie)తో 'పుష్ప' తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్(sukumar movies). ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే విజయ్ దేవరకొండతో మూవీని పట్టాలెక్కించాలని చూస్తున్నారట. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే, సుకుమార్-దేవరకొండ(sukumar vijay devarakonda) కాంబోలో తెరకెక్కిబోయే చిత్రం 'ఆర్య 3'(arya 3 movie) అని టాక్. బన్నీతో 'ఆర్య', 'ఆర్య 2' చిత్రాలతో సెన్సేషన్ సృష్టించిన ఈ లెక్కల మాస్టారు.. ఈసారి విజయ్​తో ఈ మ్యాజికల్ లవ్​స్టోరీని రూపొందించాలని భావిస్తున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఇటీవలే 'ఆర్య 3' కచ్చితంగా ఉంటుందని ప్రకటించిన సుక్కు(పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) .. ఇలా విజయ్​తో ఈ మూవీ తెరకెక్కిస్తారన్న వార్త తెలియగానే బన్నీ(allu arjun movies) ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనవుతున్నారు. ఏదేమైనా అధికార ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

ప్రస్తుతం బన్నీ(allu arjun movies)తో సుకుమార్ తెరకెక్కిస్తోన్న 'పుష్ప'.. పూర్తి మాస్ అంశాలతో కూడుకున్న సినిమా. రష్మిక హీరోయిన్​గా చేస్తున్న ఈ మూవీలో సునీల్, ఫవాద్ ఫాజిల్ విలన్లుగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ(pushpa release date) మొదటి పార్ట్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్​తో 'లైగర్'(liger movie) చిత్రం చేస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్​గా నటిస్తోన్న ఈ మూవీలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇవీ చూడండి: ప్రభాస్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్ కృతిసనన్

ABOUT THE AUTHOR

...view details