తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాన్నతో కలిసి నటించడం నా అదృష్టం: చెర్రీ​ - చిరంజీవి రామ్​చరణ్

'ఆచార్య' చిత్రంలో తన తండ్రితో పాటు వెండితెరను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​. ఈ చిత్రంలో తన తండ్రితో పాటు నటించేందుకు అవకాశమిచ్చిన దర్శకుడు కొరటాల శివకు చెర్రీ ధన్యావాదాలు తెలిపారు.

not a cameo but a fullfledged role in acharya says ramcharan
నాన్నతో కలిసి నటించడం నా అదృష్టం: చెర్రీ​

By

Published : Jan 30, 2021, 5:31 AM IST

తన తండ్రి, మెగాస్టార్‌ చిరంజీవితో స్క్రీన్​ పంచుకోవడం అదృష్టమని మెగా పవర్​స్టార్​ రామ్‌చరణ్‌ అన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్‌ 'ఆచార్య'. ఇందులో చరణ్‌ 'సిద్ధ'గా కీలకపాత్రలో కనిపించనున్నారు. గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌లో చరణ్‌ పాల్గొంటున్నారు. శుక్రవారం విడుదలైన 'ఆచార్య' టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ చిత్రంలో తానూ భాగం కావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.

"ఆచార్య' సినిమా కోసం నాన్నతో కలిసి స్క్రీన్​ పంచుకోవడం నా అదృష్టం. 'సిద్ధ' పాత్రలో నటిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇందులో నాది అతిథి పాత్ర కాదు. నా వరకూ ఇది పూర్తి నిడివి ఉన్న పాత్ర. నాన్న సినిమాలో నటించడానికి నాకు అవకాశం కల్పించిన దర్శకుడు కొరటాల శివకు ధన్యవాదాలు."

- రామ్​చరణ్​, కథానాయకుడు

అనంతరం సిద్ధ పాత్రకు రామ్‌చరణ్‌ను ఎంపిక చేసుకోవడం గురించి కొరటాల స్పందిస్తూ.. "ఈ సినిమాలో 'సిద్ధ' పాత్రకు రామ్‌చరణ్‌ తప్ప వేరే ఎవర్నీ ఊహించుకోలేకపోయాను. ఈ ప్రాజెక్ట్‌కు, ఆ పాత్రకు ఆయనే సరైన న్యాయం చేయగలరు" అని పేర్కొన్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్‌.. చరణ్‌కు జంటగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు.

ఇదీ చూడండి:టాలీవుడ్​లో ఈ ఏడాది రిలీజ్​ కానున్న చిత్రాలివే!

ABOUT THE AUTHOR

...view details