తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కీరవాణి వింత ప్రవర్తన.. డ్రైవర్​కు భయం, డైరెక్టర్​కు అయోమయం! - కీరవాణి ఆర్ఆర్ఆర్

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. గతంలో ఓ సినిమా షూటింగ్​లో వింతగా ప్రవర్తించారు. దీంతో అయోమయానికి గురైన ఆ చిత్ర అసోసియేట్ డైరెక్టర్, కీరవాణినే నేరుగా అడిగేశారు. ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే?

Keeravani
కీరవాణి

By

Published : Feb 6, 2022, 4:34 PM IST

'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' లాంటి పాన్ ఇండియా సినిమాలకు సంగీతమందించిన కీరవాణి.. తెలుగులో ఎన్నో చిత్రాలకు అద్భుతమైన​ పాటలు అందించారు. భక్తి గీతాల నుంచి ఐటమ్ సాంగ్స్ వరకు ఏదైనా సరే అందులో తనదైన మార్క్​ చూపిస్తారు. అయితే 'క్షణక్షణం' షూటింగ్​ టైమ్​లో కీరవాణి చేసిన ఓ పని.. ఆ సినిమాకు అసోసియేట్​ డైరెక్టర్​ శివ నాగేశ్వరరావును కాస్త తికమక పెట్టింది.

ఇంతకీ ఏం జరిగిందంటే?

'క్షణక్షణం' షూటింగ్ హైదరాబాద్​లో జరుగుతోంది. సంగీత దర్శకుడు కీరవాణి.. అసోసియేట్​ డైరెక్టర్​ శివ నాగేశ్వరరావుకు కారు కావాలని చెప్పారు. ఎందుకు ఏంటి? అని అడగకుండా ఆయన ప్రొడక్షన్ కారు ఏర్పాటు చేశారు. బయటకు వెళ్లిన కీరవాణి.. కేవలం పదే పది నిమిషాల్లో మళ్లీ తిరిగొచ్చేశారు.

అయితే కీరవాణి.. అంత త్వరగా ఎక్కడ వెళ్లి వచ్చారని కారు డ్రైవర్​ను శివనాగేశ్వరరావు అడిగారు. దాంతో జరిగిన విషయం చెప్పాడు సదరు డ్రైవర్.

"ఏమో తెలియదు సర్. ఆ మనిషి మాత్రం కాస్త వింతగా ప్రవర్తించారు. ఓ బస్టాప్​ దగ్గర కారు ఆపమని చెప్పి, అక్కడికి వెళ్లి కొంచెం సేపు నిలబడి వచ్చేశారు. మరో బస్టాప్​లోనే అలానే చేశారు. నాకేం జరిగిందో అర్థం కాలేదు. ఆయనను నేనేం అడగలేదు సర్" అంటూ ఆ డ్రైవర్​, శివనాగేశ్వరరావుతో చెప్పాడు.

దీంతో ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం శివనాగేశ్వరరావులో పెరిగిపోయింది. కీరవాణి దగ్గరకు వెళ్లి ఇదే విషయాన్ని ఆయన అడిగేశారు. దీంతో జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టారు కీరవాణి.

"నాకు కొత్త చెప్పులు కొనాలని అనిపించింది. పాతవి ఇంకా బాగానే ఉన్నాయి. అవి మరొకరు ఉపయోగించొచ్చు. అందుకే బస్టాప్​లకు వెళ్లి ఎవరైనా బిచ్చగాళ్లు ఉన్నారేమో అని చెక్ చేశాను. మొదటి రెండు బస్టాప్​లలో పైకప్పు సరిగా లేదు. దీంతో అక్కడికి ఎవరూ రారని అర్థమైంది. మూడో బస్టాప్​ పైకప్పు బాగుంది. దీంతో అక్కడికి రాత్రిపూట నిద్రపోయేందుకు బిచ్చగాళ్లు ఎవరైనా వస్తారని అనిపించి అక్కడే నా చెప్పులు వదిలేసి వచ్చాను. మరోసారి కొత్త చెప్పులు కొంటే ఇలానే చేస్తాను" అంటూ కీరవాణి, శివనాగేశ్వరరావుతో చెప్పుకొచ్చారు.

బాహుబలి టీమ్​తో కీరవాణి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details