తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బార్​లో వెయిటర్​గా పనిచేశా: నోరా ఫతేహి - నోరా ఫతేహి

తన కుటుంబం ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకుంది బాలీవుడ్​ డ్యాన్సర్, నటి​ నోరా ఫతేహి. 16వ ఏట నుంచే పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపిందీ భామ.. లాటరీ టికెట్లూ కూడా అమ్మినట్లు చెప్పింది.

Nora Fathehi
నోరా ఫతేహి

By

Published : May 17, 2021, 8:15 AM IST

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న త‌న కుటుంబాన్ని పోషించేందుకు 16వ ఏట ప‌నిలో చేరార‌ని వెల్లడించింది బాలీవుడ్ భామ నోరా ఫ‌తేహి. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నోరా త‌న జీవితం గురించి తెలియ‌ని ప‌లు విష‌యాల్ని పంచుకుంది.

"ఒకప్పుడు మా కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అది చూసి చేత‌నైన సాయం చేయాల‌నిపించి నేను మా పాఠ‌శాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఓ మాల్‌లో రిటైల్ సేల్స్ అసోసియేటివ్‌గా చేరాను. ఆ త‌ర్వాత ప‌లు రెస్టారెంట్లు, బార్ల‌లో వెయిట‌ర్‌గా ప‌ని చేశా. ఓ వ‌స్త్ర దుకాణంలోనూ కొన్ని రోజులు ప‌ని చేశా. అంతేకాదు లాట‌రీ టికెట్లూ అమ్మాను" అని గుర్తు చేసుకుంది.

డ్యాన్స‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కెన‌డా భామ 'టెంప‌ర్' చిత్రంలోని ప్ర‌త్యేక గీతంతో టాలీవుడ్‌కు ప‌రిచయ‌మైంది. ప్ర‌స్తుతం 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రంలో న‌టిస్తోంది.

ఇదీ చూడండి: అభిమాని చేతిపై పచ్చబొట్టు చూసి హీరోయిన్ షాక్!

ABOUT THE AUTHOR

...view details