తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటి నోరా ఫతేహికి కరోనా.. వైరస్​ ఎఫెక్ట్​ గట్టిగానే ఉందని పోస్ట్ - నోరా ఫతేహి ఈడీ కేసు

Nora fatehi covid: వైరస్​ బారిన పడిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి.. ప్రస్తుతం క్వారంటైన్​లో ఉంది. తనపై కొవిడ్ ప్రభావం గట్టిగానే ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Nora Fatehi
నోరా ఫతేహి

By

Published : Dec 30, 2021, 3:42 PM IST

Corona bollywood: బాలీవుడ్​లో ఈ మధ్య కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు వైరస్​ బారిన పడుతున్నారు. ఇప్పుడు నటి, డ్యాన్సర్​ నోరా ఫతేహికి కూడా పాజిటివ్​గా తేలింది. ఈ విషయమై ఆమె ఇన్​స్టాలో పోస్ట్ పెట్టింది.

నోరా ఫతేహి ఇన్​స్టా పోస్ట్

వైరస్​ తనపై చాలా గట్టిగానే ఎఫెక్ట్ చూపించిందని, మరికొన్ని మంచంపై నుంచి లేవలేని పరిస్థితి వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని తెలిపింది. వైరస్​ చాలా వేగంగా వ్యాప్తిస్తుందని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని పేర్కొంది. ఆరోగ్యం కంటే మీకు ఏది ముఖ్యం కాదని రాసుకొచ్చింది.

నోరాకు రెండు రోజుల క్రితమే కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయిందని ఆమె సన్నిహితుడు ఒకరు చెప్పారు. ఆమె బయట తిరిగినట్లు కనిపిస్తున్న ఫొటోలు పాతవి అని ఆయన స్పష్టం చేశారు.

నోరా ఫతేహి చివరగా జాన్ అబ్రహం 'సత్యమేవ జయతే 2' సినిమాలో కనిపించింది. ఈమె తెలుగులోనూ పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్​లో అలరించి గుర్తింపు తెచ్చుకుంది.

నోరా ఫతేహి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details