ప్రముఖ నటీనటులు అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, రానా దగ్గుబాటి కలిసి 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' సినిమాలో నటిస్తున్నారు. దేశభక్తి ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారు. అయితే ఇందులో మరో కథానాయికగా పరిణీతి చోప్రా నటిస్తోందని మొదట వార్తలు వచ్చాయి.
పరిణీతి ప్రస్తుతం.. వేరే చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుందట. ఆమె స్థానంలోనే నోరా ఫతేహిని తీసుకోనున్నారని సమాచారం. ఈ నెల 12 నుంచి ఈ అమ్మడు షూటింగ్లో పాల్గొననుందట. ఇందులో అమ్మీ విర్క్, ప్రణీత కూడా కీలకపాత్రల్లో నటించనున్నారు. అభిషేక్ దూనియా దర్శకత్వం వహిస్తున్నాడు.