తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రజనీ సినిమా రీమేక్​.. లీడ్​రోల్​ శ్రద్ధా కపూర్​! - చాల్​బాజ్​ హిందీ రీమేక్

సూపర్​స్టార్​ రజనీకాంత్, శ్రీదేవి కలిసి నటించిన 'చాల్‌బాజ్‌' చిత్రానికి ఇప్పుడు రీమేక్​ రానుంది. ఇందులో ప్రధానపాత్ర కోసం స్టార్​ హీరోయిన్ శ్రద్ధా కపూర్​ను ఎంపికచేసినట్లు చిత్ర నిర్మాణసంస్థ ప్రకటించింది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్​ ద్విపాత్రాభియం చేయనుంది.

Sharddha Kapoor  Chaalbaaz In London
శ్రద్ధా కపూర్​

By

Published : Apr 4, 2021, 6:16 PM IST

'సాహో'లో ప్రభాస్‌తో కలిసి సందడి చేసిన అందాల భామ శ్రద్ధా కపూర్.. గత ఏడాది 'స్ట్రీట్‌ డ్యాన్సర్‌', 'బాఘి 3' వంటి యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో నటించి అలరించింది. ఇప్పుడామె 'చాల్‌బాజ్‌ ఇన్‌ లండన్‌' చిత్రంలో నటిస్తున్నట్లు నిర్మాణసంస్థ వెల్లడించింది. అహ్మద్‌ఖాన్‌, షాహిర్‌ఖాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను టీ-సీరీస్‌, పేపర్‌ డాల్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్నాయి. భూషణ్‌ కుమార్‌, కిషన్‌కుమార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇందులో శ్రద్ధా కపూర్‌ మొదటిసారి ద్విపాత్రాభినయం చేయనున్నారు. "మా తదుపరి చిత్రం ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 'చాల్‌బాజ్‌ ఇన్‌ లండన్‌'లో శ్రద్ధా కపూర్‌ నటించనుంది" అని చిత్ర నిర్మాణసంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. 1989లో శ్రీదేవి, రజనీకాంత్, సన్నీ డియోల్‌ కలిసి నటించిన 'చాల్‌బాజ్‌' చిత్రానికి ఇది రీమేక్‌.

ఇదీ చూడండి:భూమి పెడ్నేకర్​ హాట్​ సెల్ఫీలు.. చూస్తే ఆహా అనాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details