తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​ ఫ్యాన్స్​కు బ్యాడ్​న్యూస్.. 'సర్కారు వారి పాట' అప్డేట్ ఆలస్యం - mahesh babu news

Sarkaru vaari paata news: 'సర్కారు వారి పాట' సినిమా తొలి గీతం మరింత ఆలస్యంగా రిలీజ్ చేయనున్నామని నిర్మాణ సంస్థ తెలిపింది. కొవిడ్ పరిస్థితులే అందుకు కారణమని స్పష్టం చేసింది.

mahesh babu
మహేశ్​బాబు

By

Published : Jan 15, 2022, 6:57 AM IST

Mahesh babu new movie: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సూపర్​స్టార్ మహేశ్​బాబు అభిమానులకు మళ్లీ నిరాశే. 'సర్కారు వారి పాట' తొలిపాట సంక్రాంతికి వస్తుందనుకుని భావించిన వాళ్లకు నిర్మాణ సంస్థ సారీ చెప్పింది. పాట కోసం మరికొంత సమయం వేచిచూడాలని పోస్ట్ పెట్టింది.

'సర్కారు వారి పాట' టీమ్ ప్రకటన

మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' తొలి గీతం గురించి త్వరలో అప్డేట్​ ఇస్తామని సంగీత దర్శకుడు తమన్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఇది వచ్చిన కాసేపటికే నిర్మాణ సంస్థ నుంచి ఓ ప్రకటన వచ్చింది. చిత్రబృందంలోని పలువురికి కొవిడ్ వచ్చిందని, అలానే పరిస్థితులు ప్రభావం వల్ల అప్డేట్స్ మరింత ఆలస్యం కానున్నాయని అందులో పేర్కొంది. అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సినిమా హీరో మహేశ్​బాబుతో పాటు సంగీత దర్శకుడు తమన్ కరోనా బారిన పడ్డారు.

బ్యాంక్​ రుణాల ఎగవేత కథతో తీస్తున్న ఈ సినిమాలో మహేశ్​ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్​గా చేస్తోంది. తమన్ సంగీతమందిస్తున్నారు. పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఏప్రిల్ 1న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు. అయితే అది కూడా వాయిదా పడేలా కనిపిస్తోంది. ఆగస్టులో కొత్త విడుదల తేదీ ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details