వరుస పాన్ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల 'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో(spirit movie prabhas heroine) 'స్పిరిట్' సినిమాను ప్రకటించారు. అయితే ఈ చిత్రంలో డార్లింగ్ సరసన దక్షిణ కొరియా భామ సాంగ్ హై కో(spirit movie prabhas heroine) నటించనుందని వార్తలొచ్చాయి. దీంతో చిత్రంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ నటించట్లేదని, అసలు చిత్రబృందం ఆమెను సంప్రదించలేదని తెలిసింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం స్పందించే వరకు వేచి ఉండాల్సిందే.
ప్రభాస్ హీరోయిన్గా కొరియన్ భామ.. నిజమెంత? - స్పిరిట్ సినిమా
ప్రభాస్ 'స్పిరిట్'(spirit movie prabhas heroine) సినిమాలో దక్షిణకొరియా భామ సాంగ్ హై కో నటించనుందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ నటించట్లేదని సినీవర్గాల టాక్.
కాగా(spirit movie villain) ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్(prabhas kareena kapoor) విలన్‌గా కనిపించననున్నట్లు సమాచారం. ఈ మూవీని టి.సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నాయి. భూషణ్ కుమార్ నిర్మాత. ఎవరూ ఊహించని రీతిలో ప్రభాస్‌ను చూడబోతున్నారని, ఆ రకంగా సందీప్ రెడ్డి పాత్రను డిజైన్ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. 'అర్జున్‌రెడ్డి', 'కబీర్‌సింగ్' చిత్రాలతో వరుసగా విజయాలు అందుకున్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి. ప్రస్తుతం ప్రభాస్ 'ఆది పురుష్', 'సలార్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత వరుసగా 'ప్రాజెక్ట్ కె', 'స్పిరిట్' చిత్రాలు చేయనున్నారు.
ఇదీ చూడండి: రిలీజ్ డేట్‌తో 'ఖిలాడి'.. 'గని' అప్డేట్