1952లో వచ్చిన 'బైజూ బవ్రా' క్లాసిక్ చిత్రానికి రీమేక్ చేయబోతున్నారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఇందులో రణ్వీర్ సింగ్ హీరోగా నటించబోతున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో హీరో అంటూ మరో కొత్త పేరు వినిపిస్తోంది. రణ్వీర్ కాదు రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్ పోషించబోతున్నాడంటూ ప్రస్తుతం హిందీ పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
భన్సాలీతో రణ్వీర్ కాదు రణ్‌బీర్!
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'బైజూ బవ్రా' అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇందులో రణ్‌బీర్ కపూర్‌ని తీసుకున్నట్లు సమాచారం.
భన్సాలీతో రణ్వీర్ కాదు రణ్‌బీర్!
అయితే ఇప్పుడే చిత్రబృందం షూటింగ్ ప్రారంభించే అవకాశం లేదని సమాచారం. ప్రస్తుతం హీరోల ఎంపికపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించనుంది. అప్పటికే భన్సాలీ 'గంగూబాయ్'ని పూర్తి చేస్తారు.