జేమ్స్ బాండ్ సిరీస్‌లోని 25వ సినిమా 'నో టైమ్ టు డై'. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరోగా డేనియల్ క్రెగ్ నటించాడు. అతడు చేసిన యాక్షన్ సీన్లు అలరిస్తున్నాయి. గత చిత్రాలకంటే స్టయిల్, స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడీ నటుడు.
ఆస్కార్ విజేత రమీ మాలిక్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. కారీ ఫుకునాగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను తొలుత నవంబర్‌లో విడుదల చేయాలనుకున్నారు. అది సాధ్యం కాలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేశారు. కానీ చివరకు భారత్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్ 3న, అమెరికాలో ఏప్రిల్ 8న, కెనడాలో ఏప్రిల్ 2న విడుదల కానుంది.