హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ నటించిన 'నో టైమ్ టు డై' చిత్రానికి కరోనా వైరస్‌తో చిక్కులు ఎదురయ్యాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బాక్సాఫీస్ మార్కెట్ అయిన చైనాలో... వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఫలితంగా ఆ దేశంలో విడుదలను చిత్రబృందం వాయిదా వేసింది. అంతేకాకుండా ఏప్రిల్ నెలలో సినిమా ప్రచారాలనూ మానుకుంది.
చివరిసారి బాండ్ పాత్రలో...
2005 నుంచి తెరకెక్కిన బాండ్ సిరీస్ చిత్రాల్లో క్రెగ్ తనదైన శైలిలో నటించి మెప్పించాడు. బాండ్ సిరీస్‌లో 25వ సినిమాగా 'నో టైమ్ టు డై' తెరకెక్కింది. ఈ చిత్రంలో చివరిసారిగా బాండ్ పాత్రలో అలరించనున్నాడు క్రెగ్. ఈ చిత్రానికి కెరీ జోజి దర్శకత్వం వహించాడు.
హాలీవుడ్ ప్రముక నటీనటులు బెన్ విక్షా, నామి హ్యారిస్, రాల్ఫ్ ఫిన్నెస్, లి సైడక్స్, జెఫ్రి వ్రైట్, రమి మాలెక్, లషనా లించ్ తదితరులు ఇందులో నటించారు. ఏప్రిల్ 10న అమెరికాలో ఈ సినిమా విడుదల కానుంది
ఇదీ చదవండిః"సీఏఏను రద్దు చేయాల్సిందే".. కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి..!