యువ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన 'ఎఫ్ 2'.. బాక్సాఫీసు వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు సీక్వెల్ 'ఎఫ్ 3' తెరకెక్కుతోంది. గతేడాది డిసెంబరులో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఇందులో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నారు. అయితే వీరిద్దరితో పాటు సీక్వెల్లో మరో హీరోకూ అవకాశం ఉందని ఇటీవల కొన్ని ఊహాగానాలు వినిపించాయి. ఆ మూడో హీరోగా రవితేజ, గోపీచంద్, సాయి ధరమ్‌తేజ్ నటిస్తున్నారంటూ వార్తలొచ్చాయి. దీనిపై దర్శకుడు అనిల్ స్పందించారట.
'ఎఫ్ 3'లో మూడో హీరోపై దర్శకుడు క్లారిటీ!
'ఎఫ్ 3' చిత్రంలో మూడో హీరో ఎవరనే దానిపై టాలీవుడ్లో కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిపై స్పందించిన దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇందులో మూడో హీరో పాత్ర ఉండదని చెప్పినట్లు సమాచారం. అయితే సీక్వెల్లో కథాంశం మారుతుందని వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది.
'ఎఫ్ 3'లో మూడో హీరోపై దర్శకుడు క్లారిటీ!
'ఎఫ్ 3' చిత్రంలో మూడో హీరో ఉండరని దర్శకుడు అనిల్ తేల్చి చెప్పారట. అసలు తనకు ఆ ఆలోచనే లేదని తెలిపినట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 'ఎఫ్ 2'లో నటించిన కథానాయకులే.. ఇందులోనూ ఉంటారని ఆయన వెల్లడించారట. సిరీస్‌లోని తొలి చిత్రం భార్యల కథాంశంతో రూపొందగా.. సీక్వెల్ కథ మాత్రం డబ్బు చుట్టూ ముడిపడి ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఇదీ చూడండి:ఆస్కార్ రేసులో 'ఆకాశమే నీ హద్దురా'!
Last Updated : Jan 27, 2021, 2:53 PM IST