బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కత్రినాకైఫ్, విక్కీకౌశల్ మరి కొన్నిరోజుల్లో పెళ్లి చేసుకోనున్నారు. డిసెంబర్ ఆరంభంలో వీరిద్దరూ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇరువురు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ పెళ్లికి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.(katrina kaif vicky kaushal marriage)
డిసెంబర్ 7 నుంచి 9 వరకూ జరగనున్న వీరి వివాహానికి రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ వేదిక కానుందట. తమ జీవితాల్లో ఎంతో కీలకమైన ఈ రోజును కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరుపుకోవాలని వీరిద్దరూ భావించారట.