బుల్లితెరపై యాంకర్‌గా మెరిసి.. వెండితెరపై పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ భరద్వాజ్. కొన్ని ప్రత్యేక గీతాల్లోనూ నర్తించి మెప్పించారు. తాజాగా.. కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న 'చావు కబురు చల్లగా' సినిమాలో ఐటమ్ సాంగ్‌లో చిందేశారు అనసూయ. దీంతో రాబోయే మరికొన్ని సినిమాల్లోనూ ఆమె స్పెషల్ సాంగ్స్ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
దీనిపై స్పందించిన అనసూయ.. "ఇకపై ఎలాంటి స్పెషల్ సాంగ్స్ చేయను. చావు కబురు చల్లగా చిత్రంలోని పాటను నా స్నేహితుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. అందుకే అందులో నటించేందుకు ఆసక్తి చూపాను. నటనకు ప్రాధాన్యం ఇచ్చే రోల్స్ మాత్రమే చేయాలనుకుంటున్నా," అని తెలిపారు.