తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బయోపిక్​ల్లో జాన్వీ కపూర్​ ఇకపై నటించదా? - జాన్వీ బయోపిక్​

చిన్న వయసులోనే బయోపిక్​ల్లో నటించడం సరికాదని భావిస్తున్న జాన్వీ కపూర్... గ్లామరస్ పాత్రలే చేయాలని అనుకుంటోంది. భారత తొలి మహిళ పైలట్ 'గుంజన్ సక్సేలా'లో ప్రస్తుతం నటించింది. త్వరలో ఓటీటీలో విడుదల కానుందీ చిత్రం.

బయోపిక్​ల్లో జాన్వీ కపూర్​ ఇకపై నటించదా?
జాన్వీ కపూర్

By

Published : Aug 1, 2020, 9:32 PM IST

'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' ట్రైలర్​కు విశేష స్పందన లభిస్తోంది. నటి జాన్వీ కపూర్​ చక్కగా చేసిందని కొందరు మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం చిన్న వయసులోనే బయోపిక్​లు ఎందుకని అంటున్నారు. దీని గురించే జాన్వీ కూడా ఆలోచన చేస్తోందట.

తండ్రి బోనీ కపూర్​తో పాటు తన మేనేజర్​కు జాన్వీ ఇదే విషయం చెప్పిందని సమాచారం. ఇకపై గ్లామరస్ పాత్రలున్న కమర్షియల్ సినిమాలే చేస్తానని తెలిపింది. కొన్నాళ్ల అనుభవం వచ్చిన తర్వాత హీరోయిన్​ ప్రాధాన్య చిత్రాల్లో నటిస్తానని స్పష్టం చేసింది.

దీనితో పాటే దక్షిణాదిలోనే జాన్వీ కపూర్.. అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతోంది. సరైన కథల కోసం బోనీ కపూర్​ చూస్తున్నారు. స్క్రిప్ట్​లు నచ్చిన వెంటనే ఈ భామ.. ఇక్కడి ప్రేక్షకులనూ అలరించనుంది.

ABOUT THE AUTHOR

...view details