తన పెళ్లి గురించి కొనేళ్ల వరకు ఆలోచించనని చెప్పింది స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్. ప్రస్తుతం కెరీర్ మీద తన పూర్తి దృష్టి సారించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతోపాటే తనకు రాజకీయాలు గురించి ఏమీ తెలియదని చెప్పింది శ్రుతి. అందుకే తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో తన తండ్రి ప్రముఖ హీరో కమల్‌హాసన్ స్థాపించిన పార్టీ తరఫున కూడా ప్రచారం చేయనని వెల్లడించింది. కాగా, సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్ మళ్ళీ కలిసి నటించాలని వారి అభిమానులలాగే తాను ఆశగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.
నాన్న పార్టీ తరఫున ప్రచారం చెయ్యను : శ్రుతిహాసన్ - శ్రుతిహాసన్ కమల్‌హాసన్ పార్టీకి ప్రచారం చెయ్యను
ప్రస్తుతం తాను పెళ్ళికి తొందరపడటం లేదని చెప్పింది స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్. చిత్రసీమలో మరెన్నో సాధించాల్సి ఉందని వెల్లడించింది. దీంతో పాటే తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో తన తండ్రి కమల్‌హాసన్ స్థాపించిన పార్టీ తరఫున ప్రచారం కూడా చెయ్యనని తెలిపింది. ప్రస్తుతం 'క్రాక్', 'వకీల్ సాబ్' సహా పలు చిత్రాల్లో నటిస్తోందీ ముద్దుగుమ్మ.
శ్రుతిహాసన్s
ప్రస్తుతం రవితేజ 'క్రాక్', పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్', విజయ్ సేతుపతి 'లాభం' సహా పలు చిత్రాల్లో నటిస్తోందీ భామ.
ఇదీ చూడండి షారుక్- అట్లీ సినిమాకు రెహమాన్ సంగీతం!