బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' రీమేక్ హక్కులు కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఆ సినిమాలో ఎవరు నటిస్తారనే విషయమై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై స్పందించాడు కరణ్.
"శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'డియర్ కామ్రేడ్' చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. రీమేక్లోని ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తారనేది ఇంకా నిర్ణయించలేదు." -కరణ్ జోహార్, దర్శక నిర్మాత