Katrinakaif Vickykaushal Honeymoon: సాధారణంగా ఏ జంట అయినా పెళ్లి చేసుకుంటే.. ఈ వేడుకకు ముందు, తర్వాత తమ వృత్తికి కాస్త విరామం ఇస్తారు. బ్యాచిలర్ పార్టీ, హనీమూన్ అంటూ సరదాగా గడుపుతారు. ఇక సెలబ్రిటీల విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాల్దీవులు సహా ఇతర విదేశీ పర్యటనలకు వెళ్లిపోతుంటారు. అయితే డిసెంబరు 9న మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్న విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ మాత్రం ఇందుకు భిన్నం!
ఇప్పటికే పెళ్లికి ముందు బ్రేక్ కూడా తీసుకోకుండా నిర్విరామంగా షూటింగ్స్‌లో పాల్గొన్నారు విక్కీ-కత్రిన. ఇక వివాహం తర్వాత కూడా విరామం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారట! అందుకోసం హనీమూన్‌ను కూడా వాయిదా వేయనున్నారని తెలిసింది. పెళ్లి అయిపోయిన వెంటనే తమ షూటింగ్స్‌ను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట.