తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్​ కేసును విస్మరించలేదు : సీబీఐ

సుశాంత్​ సింగ్ కేసులో దర్యాప్తు తుది దశకు రాలేదని సీబీఐ తెలిపింది. దర్యాప్తు నెమ్మదిగా, పక్కదారి పడుతుందని సుశాంత్​ న్యాయవాది ఆరోపించిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. ​

Rajput
సుశాంత్​ కేసు

By

Published : Sep 28, 2020, 6:03 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్‌ సింగ్‌ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తుపై ఇంకా ఎలాంటి తుది అభిప్రాయానికి రాలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు అధికారి తెలిపారు. ప్రస్తుతం వృత్తిపరమైన దర్యాప్తు కొనసాగుతోందని చెప్పిన ఆయన.. విచారణలో ఏ కోణాన్ని విస్మరించలేదని వివరణ ఇచ్చారు.

సీబీఐ దర్యాప్తు నెమ్మదిగా సాగుతూ, పక్కదారి పడుతుందని సుశాంత్‌ తరఫు న్యాయవాది వికాస్‌, గతవారం ఆరోపించిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది సీబీఐ. జూన్‌ 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని సుశాంత్ చనిపోయారు. అనంతరం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కొద్ది రోజులుగా డ్ర‌గ్స్​కు సంబంధించిన అంశం చర్చనీయాంశమైంది. దీంతో సుశాంత్​ కేసును పక్కన పెట్టి.. మాదక ద్రవ్యాలపై దృష్టి సారిస్తున్నారని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదీ చూడండి 'చిన్నారి పెళ్లికూతురు' దర్శకుడు.. కూరగాయలు అమ్ముతూ

ABOUT THE AUTHOR

...view details