తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. అనుకున్న తేదీకే 'సలార్​'! - సలార్​ రిలీజ్​ డేట్​లో మార్పు లేదు

కరోనా కారణంగా పలు పెద్ద చిత్రాల షూటింగ్​లు, విడుదలలు వాయిదా పడుతున్నా.. ప్రభాస్​ హీరోగా తెరకెక్కుతోన్న 'సలార్​' అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. గతంలో ప్రకటించిన తేదీకే సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు ప్లాన్​ చేస్తున్నట్లు టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

No change in plans for Prabhas's Salaar release
'సలార్​' విడుదలలో ఎలాంటి మార్పు లేదు!

By

Published : May 24, 2021, 5:32 AM IST

దేశంలో కరోనా రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు పెద్ద చిత్రాలు విడుదలలు సహా చిత్రీకరణలూ ఆగిపోయాయి. అయితే ప్రభాస్​ - ప్రశాంత్​ నీల్​ కాంబినేషన్​లో రూపొందుతోన్న 'సలార్​' షూటింగ్​లో ఎలాంటి మార్పు ఉండదని సమాచారం. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలోగా చిత్రీకరణను పూర్తి చేసి.. ఇదివరకు ప్రకటించిన తేదీ(ఏప్రిల్​ 14న)నే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం ప్లాన్​ చేస్తుందట.

'సలార్​' రిలీజ్​ పోస్టర్​

ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్​గా నటిస్తోంది. ఇంకా ప్రతినాయకుడు ఎవరనేది వెల్లడించలేదు. రవి బస్రూర్​ సంగీతమందిస్తున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్​ దర్శకత్వంలో హొంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది.

ఇదీ చూడండి..'మిస్​ యూ నాన్న!'.. యాంకర్​ ప్రదీప్ భావోద్వేగపు పోస్ట్​

ABOUT THE AUTHOR

...view details