హీరో వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ వివాహం.. ప్రస్తుతం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. జనవరి 24(ఆదివారం)న ముంబయిలోని అలీబాగ్ రిసార్ట్స్‌లో వీరిద్దరి పెళ్లి జరగనుందని సమాచారం. సన్నిహితుల మధ్య ఈ వేడుకను నిరాడంబరంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వేడుకకు సినీప్రముఖులను ఆహ్వానించలేదని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.
వరుణ్-నటాషా పెళ్లి.. బాలీవుడ్‌కు నో ఇన్విటేషన్! - వరుణ్ ధావన్ నటాషా వార్తలు
స్టార్ హీరో వరుణ్ ధావన్ పెళ్లి.. ప్రస్తుతం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. జనవరి 24న అలీబాగ్‌లోని ఓ రిసార్ట్స్‌లో వివాహం జరగనుందని.. జనవరి 26న సినీప్రముఖులకు విందు ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అయితే ఈ వేడుకకు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులను ఆహ్వానించలేదని తెలుస్తోంది.
![వరుణ్-నటాషా పెళ్లి.. బాలీవుడ్‌కు నో ఇన్విటేషన్! No Bollywood celebrity invited for Varun-Natasha wedding in Alibaug](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10335455-191-10335455-1611298907870.jpg)
వరుణ్-నటాషాల పెళ్లికి బాలీవుడ్‌కు నో ఇన్విటేషన్!
వరుణ్, నటాషా వివాహం కోసం అలీబాగ్‌లోని ఓ రిసార్ట్స్‌ను అద్దెకు తీసుకున్నారట. జనవరి 22 నుంచి 26 వరకు ఇరు కుటుంబాలు అక్కడే ఉండనున్నారని సమాచారం. పెళ్లి జరిగిన తర్వాత ముంబయిలో సినీప్రముఖుల కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహానికి పనిచేసిన వెడ్డింగ్ ప్లానర్.. వరుణ్, నటాషాల పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:'మీర్జాపూర్' నిర్మాతలకు సుప్రీం నోటీసులు