తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నందమూరి హీరో సినిమా టైటిల్ తెలిసేది రేపే - tollywood

నందమూరి కల్యాణ్ రామ్​, మెహరీన్ ప్రధానపాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ రేపు ప్రకటించనున్నారు.

సినిమా

By

Published : Jul 4, 2019, 4:50 PM IST

నందమూరి నటుడు కల్యాణ్ రామ్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్​గా మెహరీన్ నటిస్తోంది. రేపు కల్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టైటిల్​ ప్రకటించనున్నారు. నందమూరి హీరో 17వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ పూర్తి కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం.

ఎన్​కేఆర్​17

'ఆదిత్య మ్యూజిక్' ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో నిర్మితమౌతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. 'శతమానంభవతి', 'శ్రీనివాస కళ్యాణం' వంటి అచ్చ తెలుగు పేర్లు పెట్టిన దర్శకుడు సతీష్ ఈ సారి కల్యాణ్ రామ్​తో సినిమాకు ఎటువంటి టైటిల్ ఫిక్స్ చేస్తాడోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవీ చూడండి..ఆర్ఆర్​ఆర్​ షూటింగ్​కు బ్రేక్.. ఎందుకంటే ?

ABOUT THE AUTHOR

...view details