తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాలీవుడ్​ రీమేక్​లో నటించనున్న పరిణీతి - HOLLYWOOD REMAKE

హాలీవుడ్ చిత్రం 'ద గర్ల్ ఆన్ ద ట్రైన్​' ను హిందీలో రీమేక్​ చేయబోతుంది రిలయన్స్​ ఎంటర్​టైన్​మెంట్​. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించనుంది. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

పరిణీతి చోప్రా

By

Published : Apr 24, 2019, 1:51 PM IST

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా హాలీవుడ్ రీమేక్​లో నటించబోతుంది. 'ద గర్ల్ ఆన్ ద ట్రైన్' సినిమాను హిందీలో తీస్తోంది రిలయన్స్​ ఎంటర్​టైన్​మెంట్ సంస్థ. ఈ చిత్రానికి రిభూ దాస్​గుప్తా దర్శకత్వం వహించనున్నారు. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

"ప్రేక్షకులు నన్ను ఇంతకుముందు చూడని పాత్రల్లో నటించాలనుకుంటున్నా. ద గర్ల ఆన్ ద ట్రైన్​లో అలాంటి రోల్​నే పోషించబోతున్నా. ఆల్కహాల్​కు బానిసైన ఓ మహిళ కిడ్నాపింగ్ కేసులో ఇరుక్కుంటుంది. ఈ సినిమా నాకు మంచి పేరు తీసుకొస్తుందని అనుకుంటున్నా" - పరిణీతి చోప్రా, బాలీవుడ్ నటి

2016లో విడుదలైన 'ద గర్ల ఆన్ ద ట్రైన్' చిత్రం హాలీవుడ్​లో మంచి విజయాన్నందుకుంది. ఎమిలీ బ్రంట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. పాల్ హాకిన్స్ నవల ఆధారంగా తీసిన ఈ చిత్రానికి హిందీలో ఇంకా పేరు ఖారారు చేయలేదు.

ABOUT THE AUTHOR

...view details