తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​-త్రివిక్రమ్​ సినిమాలో 'వకీల్​సాబ్​' భామ! - మహేష్​ త్రివిక్రమ్​ సినిమా నివేథా

'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్​ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో నటించనున్నారు సూపర్​స్టార్​ మహేశ్​బాబు. 2022 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందులోని ఓ కీలకపాత్ర కోసం నివేథా ధామస్​ను ఎంపికచేసినట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Nivetha Thomas to play a crucial role in Mahesh Babu - Trivikram new movie
మహేశ్​-త్రివిక్రమ్​ సినిమాలో 'వకీల్​సాబ్​' భామ!

By

Published : Jun 3, 2021, 4:00 PM IST

Updated : Jun 3, 2021, 4:42 PM IST

సూపర్​స్టార్​ మహేశ్​బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఆ చిత్ర ప్రీ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయి. ఇందులో మహేశ్​ 'రా' ఏజెంట్​గా కనిపించనున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం యువ కథానాయిక నివేథా ధామస్​ను సంప్రదించినట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై ఇప్పుడు నెట్టింట్లో హాట్​ టాపిక్ నడుస్తోంది.

మరోవైపు ఈ సినిమాకు 'పార్థు' అనే టైటిల్​ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 'పార్థు' అనగానే గుర్తొచ్చేది త్రివిక్రమ్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'అతడు' చిత్రంలో మహేశ్​ పాత్ర పేరు. ఇప్పుడిదే పేరును కొత్త చిత్ర టైటిల్​గా పెట్టాలని త్రివిక్రమ్​ భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

ప్రస్తుతం మహేశ్​​.. పరశురామ్​ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదీ చూడండి:మహేశ్​ సినిమాతో జాన్వీ టాలీవుడ్​ ఎంట్రీ!

Last Updated : Jun 3, 2021, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details