స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాలో నటిస్తున్నాడు. కరోనా వల్ల షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్.. అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కొత్త విషయం బయటకొచ్చింది.
అల్లు అర్జున్ ప్రేమికురాలిగా ముద్దుగుమ్మ నివేదా! - సినిమా వార్తలు
కథానాయకుడు అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప'లో కీలక పాత్ర కోసం నటి నివేదా థామస్‌ను ఎంచుకున్నారట. ఇప్పటికే వచ్చిన బన్నీ లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
అల్లు అర్జున్
ఇందులో అల్లు అర్జున్.. లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. హీరోయిన్ రష్మిక.. అటవీ అధికారిగా నటిస్తోంది. అయితే బన్నీ ప్రేమికురాలి పాత్ర కోసం ముద్దుగుమ్మ నివేదా థామస్‌ను ఎంపిక చేశారట. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు 'పుష్ప' వచ్చే అవకాశముంది.