ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఎంతో కష్టపడుతుంటారు నటీనటులు. డ్యాన్స్ విషయంలో కొంచెం ఎక్కువ. బీట్‌కి తగినట్టు స్టెప్పులేసేందుకు ఒకటికి నాలుగుసార్లు ప్రాక్టీస్ చేయాల్సిందే. 'వి' చిత్రంలోని 'టచ్ మీ బేబీ' పాట కోసం అంతే కష్టపడింది నాయిక నివేదా థామస్. ఇది పార్టీ నేపథ్యంలో సాగే గీతం. ట్రెండీగా ఉంటుంది.
'ఫలితం రావాలంటే అభ్యసించాల్సిందే' - నివేదా థామస్ తాజా వార్తలు
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'వి'. ఈ సినిమాలో 'టచ్ మీ బేబీ' పాటలో తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది హీరోయిన్ నివేదా థామస్. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రాక్టీస్ వీడియోను నెట్టింట షేర్ చేసింది.
ఈ పాటలో నివేదా తన డ్యాన్స్‌తో కుర్రకారుని ఊపేసింది. అంతగా అలరించడం వెనక ఉన్న రహస్యాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బయటపెట్టింది నివేదా. మంచి ఫలితం రావాలంటే అభ్యసించాల్సిందే (ప్రాక్టీస్ ఫర్ ప్రోగ్రెస్) అని ఈ పాట కోసం ప్రాక్టీస్ చేసిన ఓ వీడియో పంచుకుంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీకి ధన్యవాదాలు తెలిపింది.
నాని, సుధీర్ బాబు కథానాయకులుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన 'వి'లో ఓ రచయిత్రిగా కనిపించింది నివేదా. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది.