తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అప్పుడు కమల్​హాసన్​.. ఇప్పుడు రజనీకాంత్​ - kollywood cinema news

తమిళ స్టార్ హీరోలు కమల్​హాసన్, రజనీకాంత్​లకు కూతురిగా నటించే అవకాశం కొట్టేసింది నివేతా థామస్. 'దర్బార్'​లో రజనీ పాత్ర పేరు ఇదేనంటూ ఇటీవలే ట్వీట్ చేసిందీ భామ.

రజనీకాంత్-నివేతా థామస్-కమల్ హాసన్

By

Published : Oct 21, 2019, 2:25 PM IST

దక్షిణాది భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నివేతా థామస్. సూపర్​స్టార్ రజనీకాంత్​ హీరోగా నటిస్తున్న 'దర్బార్'​లో అతడి కూతురిగా కనిపించనుంది. ఆ విషయాన్ని ఇటీవలే ట్విట్టర్​లో పంచుకుంది. అయితే అంతకు ముందు కమల్​హాసన్​ 'పాపనాశనం'లోనూ కథానాయకుడి కుమార్తెగా నటించింది. ఇలా ఈ ఇద్దరితో నటించే అవకాశం కొట్టేసిందీ భామ.

హీరోయిన్ నివేతా థామస్

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది 'దర్బార్'​. ఇందులో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారిగా కనిపించున్నాడు రజనీ. నయనతార హీరోయిన్. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు. మురుగదాస్ దర్శకుడు. దీపావళికి అభిమానుల కోసం ఓ కానుకను సిద్ధం చేస్తోంది చిత్రబృందం. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుందీ సినిమా.

ఇది చదవండి: నివేదా.. కుర్రకారు నీకు ఫిదా

ABOUT THE AUTHOR

...view details