సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్ షోతో పాటు విజిల్స్ పక్కా అని చెబుతోంది హీరోయిన్ నివేదా థామస్. తలైవాతో ఆమె తొలిసారి కలిసి నటించిన చిత్రం 'దర్బార్'. రేపు(గురువారం) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసిందీ భామ. వీటితో పాటే మరిన్ని విషయాలు చెప్పింది.
"రజనీకాంత్‌కు నేను వీరాభిమాని. ఆయన అన్ని సినిమాల్ని నేను ఉదయం 4 గంటలకే చూసేదాన్ని. దానితో పాటే విజిల్స్ పక్కా. ఈ సినిమాలో నాకు అవకాశం రావడం అదృష్టం. ఇది మురుగదాస్ ప్రత్యేక చిత్రమవుతుంది. నా పాత్ర ఇందులో ముఖ్యమైనదే. సినిమా చూస్తే మీకు అది తెలుస్తుంది. సెట్లో ఎవరు బాగా చేసిన వారిని రజనీ మెచ్చుకుంటారు" -నివేదా థామస్, హీరోయిన్