ఆఫ్రికా ఖండంలోనే(niveda thomas updates) అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని నటి నివేదా థామస్ విజయవంతంగా అధిరోహించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం ఆమె ఓ ట్వీట్ చేశారు. 'ఆఫ్రికాఖండంలోని కిలిమంజారోని అధిరోహించాను' అంటూ ఆమె ఓ ఫొటో షేర్ చేశారు.
అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన నివేదా - kilimanjaro mountain peak
ఆఫ్రికా ఖండంలోనే(niveda thomas updates) అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు నటి నివేదా థామస్(niveda thomas upcoming movies). ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు.
![అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన నివేదా niveda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13437622-694-13437622-1634988731925.jpg)
చిన్నప్పటి నుంచి నివేదాకు ట్రెక్కింగ్ అంటే ఆసక్తి ఎక్కువ. కిలిమంజారో అధిరోహించాలనే లక్ష్యంతో ఆరు నెలలపాటు ట్రెక్కింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. 19,340 అడుగుల ఎత్తు ఉన్న కిలిమంజారో పర్వతంపై ట్రెక్కింగ్ ఎంతో సాహసోపేతంతో కూడుకున్నది. ఇక, సినిమాల విషయానికి వస్తే ఇటీవల 'వకీల్‌సాబ్'తో(nivetha thomas vakeel saab) నివేదా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నివేదా పల్లవి అనే అమ్మాయి పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఆమె 'మీట్ క్యూట్'లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: మొత్తానికి నా కల నెరవేరింది: సమంత